19 March, 2026 | 3:54 PM

తొందరలోనే సాదా బైనామాలకు పరిష్కారం

19-03-2026 02:26 PM

హైదరాబాద్: తెలంగాణలో సాదా బైనామా భూములకు(Sada Bainama Lands) సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది(Ugadi) వేడుకల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్నారు.

శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆవిష్కరించారు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థించారు. ఈ నెల 22న రైతు భరోసా అందించబోతున్నామని తెలియజేస్తూ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి,, ఎమ్మెల్సీ మహేష్ కుమార్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.