దేశీయ మార్కెట్లు పతనం.. ఒకేరోజు రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి
19-03-2026 02:49 PM
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం(Stock Markets) అయ్యాయి. సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉండగా, నిఫ్టీ 600 పాయింట్లకుపైగా కుప్పకూలింది. ఒకే రోజు రూ. 8 లక్షల కోట్లకుపైగా సంపద ఆవిరి అయింది. స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం పడింది. క్రూడాయిల్ ధరలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. గ్యాస్, చమురు క్షేత్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో తీవ్ర ప్రభావం పడింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర(Brent crude oil Price) సరఫరాలో అంతరాయాల నేపథ్యంలో 111 డాలర్లకు చేరింది.




