12 March, 2026 | 3:04 AM

బాధితురాలికి సీఎం ఆర్‌ఎఫ్ అందజేత

12-03-2026 01:17 AM

అందజేసిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్

సనత్‌గర్, మార్చి 11 (విజయక్రాంతి):- మెరుగైన వైద్యం కోసం అవసరమైన సహా య సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాద వ్ అన్నారు. సనత్‌నగర్‌లోని ఎస్‌ఆర్‌టీకి చెందిన హేమలతకు చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 3.50 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం మంజూరు కాగా, బుధవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారురాలి కు మార్తెకు అందజేశారు.

హేమలత గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతుండగా, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ఆర్ధిక సహాయం మంజూరైనది. కార్యక్ర మంలో సనత్ నగర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, హేమలత సోదరుడు సుభాష్, మురళి తదితరులు ఉన్నారు.

అమీర్‌పేట్ కనకదుర్గాదేవి ఆలయంలో కుంభాభిషేకం

అమీర్‌పేలోని కనకదుర్గాదేవి ఆలయంలో కుంభాభిషేకం పూజలు ఘనంగా నిర్వహించారు. బుధవారం మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై పూజలలో పాల్గొన్నారు. అనంతరం విద్యా శంకర భారతి మహాస్వామి ఆధ్యాత్మిక బోధనలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలకించారు.

ఎమ్మెల్యే వెంట ఆల య ఈవో అంబుజ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కూతురు నర్సింహ, కట్టా బలరాం, వేణు గౌడ్, నారాయణ రాజు, వినోద్, బాసా లక్ష్మీ, లక్ష్మీ తదితరులు ఉన్నారు.