వదిలిపెట్టం
- బాధితులందరికీ ఇళ్లు కట్టించాల్సిందే
- సీఎం, ముగ్గురు మంత్రులు బహిరంగ క్షమాపణ చెప్పాలి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించే దాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. త్వరలో శాసన సభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారి రియల్ ఎస్టేట్ మాఫియా బయటపడుతుందని భయంతో ఆగమేఘాల మీద వెలుగు మట్ల బాధితులకు ఇళ్ల పట్టాలు పంచుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదల భూములు గుంజుకుంటూ రియల్ ఎస్టేట్ మాఫియా లాగా దౌర్జన్యానికి పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ముగ్గురు మంత్రులు వారి బినామీలైన వేజెళ్ల సురేష్, ముళ్లా కిషోర్, దామోదర్‌రావు రియల్ ఎస్టేట్ దందా కోసం వెయ్యి మంది పేదలకు గూడు లేకుం డా చేశారని ఆరోపించారు. బాధితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం ద్వారా వారి తప్పును ఒప్పుకున్నట్టు స్పష్టమవుతున్నదన్నారు.
బుధవారం తెలంగాణ భవ న్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 1950లోనే భూదానోద్యమ స్ఫూర్తితో ఇద్దరు పెద్దలు వెలుగుమ ట్లలో 62 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ నాయకులంటేనే భూ మాఫియాగాళ్లు కాబట్టే 1989లో వారి ప్రభు త్వం రాగానే అందులో నుంచి 31 ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు.
2014 ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు 1895 మందికి పట్టాలు ఇచ్చారని, అందులో ఇప్పటి వరకు దాదాపు 1000 మంది ఇళ్లు కూడా కట్టుకున్నారని తెలిపారు. తమ ప్రభు త్వ హయాంలో అనేక మంది పేదలకు భూ ముల, ఇళ్ల పట్టాలిస్తే.. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విధ్వంసం, వినాశనం తప్ప మరొ కటి చేయడం లేదని విమర్శించారు.
శత్రు దేశం దండయాత్ర చేసినట్టుగానే..
శత్రు దేశంపైకి దండయాత్ర చేసినట్టు 3 వేల మంది పోలీసులతో వారిని బయటికి వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారు జామున వచ్చి, ఆడబిడ్డలు వేడుకుంటున్నా కనికరించకుండా ఇళ్లను నేలమట్టం చేయడం అమానుషమన్నారు. బాధితుల పక్షాన ప్రశ్నిస్తే ల్యాండ్ మాఫియా అంటున్నారని, మంత్రుల బినామీలు ల్యాండ్ మాఫియా అని స్పష్టం చేశారు. చంపి వ్యక్తే సంతాపం తెలిపినట్టు ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలిస్తామని ఈ సిపాయిలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
1000 మందిలో కేవలం 310 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఏం న్యాయమని ప్రశ్నించారు. గతంలో 100 గజాల స్థలంలో ఇళ్లు కట్టుకుంటే, ఇప్పుడు 75 గజాలు మాత్రమే ఇస్తున్నారని.. మిగిలిన 25 గజాల స్థలాన్ని ఎవరు నొక్కేయ్యాలని చూస్తున్నారని, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డా, తుమ్మలా, లేక భట్టి విక్రమార్కనా అని ప్రశ్నించారు. బాధితురాలు కాలు విగిరి రోడ్డుపై కుంటుతూ నడుస్తుంటే పెయిడ్ ఆర్టిస్టు అంటారా.. ‘మీరు మనుషులా లేక మృగాలా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డున పడేసినందుకు, వారిని అవమానకరంగా మాట్లాడినందుకు సీఎం, ముగ్గురు మంత్రులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఉండి ప్రజల సొమ్మును పందికొక్కుల దోచుకుంటూ, వేల కోట్ల కాంట్రాక్టులు కొడుకు కంపెనీకి ఇప్పించుకుంటున్న ‘నువ్వు పెయిడ్ ఆర్టిస్టు’అని మండిపడ్డారు. సిగ్గు ఉంటే బాధితుల కాళ్లు మొక్కి, వాళ్లకు ఇళ్లు కట్టించి మాట్లాడాలని హితవు పలికారు.
మా ప్రభుత్వం వచ్చాక సమగ్ర విచారణ
తమ ప్రభుత్వం వచ్చాక ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించి ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. భూదాన్ భూము ల్లోనే ఇళ్లు కట్టించాలంటే కలెక్టర్ దగ్గర సమాధానం లేదని, పక్కన కాంగ్రెస్ నాయకుడు కట్టిన విల్లాలకు ఈ పేదల ఇళ్లు అడ్డంగా ఉన్నాయనే ఉద్దేశంతో ఈ కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు. బాధితులకు తాగునీరు, ఆహా రం, ఆడబిడ్డలకు కనీసం బట్టలు మార్చుకునే సౌకర్యం కూడా లేని స్థితిలో వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులపై పెట్టిన కేసు లన్నీ ఎత్తేసే వరకు, కూలగొట్టిన ప్రతి ఇల్లు కట్టించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కూల్చివేతల్లో భాగంగా బాధితుల ఇళ్లలో సామాను ధ్వంసం అయిందని, ప్రతి కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు కేవలం ఇందిరమ్మ ఇళ్లు సరిపెట్టకూడదని, నష్టపోయిన మొత్తాన్ని చెల్లించాలన్నారు.
పొట్ట దాచలేక విసిగిపోయాను: కేటీఆర్
ఇన్ని రోజులు తన పొట్టను దాచలేక విసిగిపోయానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫన్నీ కామెంట్ చేశారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా తన ఫిట్‌నెస్‌పై ఆసక్తికర పోస్టు చేశారు. ఆరునెలల విరామం తర్వాత మళ్లీ జిమ్‌లో కసరత్తు ప్రారంభించానని తెలిపారు. జూలై నాటికి తనకు 50 ఏళ్లు వస్తాయని, అప్పటికి శరీరాకృతి మారుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిమ్‌లో ఉన్న ఫొటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.




