12-02-2026 02:59:38 AM
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ఇప్పుడు కూడా బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లో బుధవారం ఆయన మీడియాతో మా ట్లాడారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా.. బీఆర్‌ఎస్సా అన్న సోయి కూడా లేకుండా అసలు మంత్రులు మాట్లాడుతున్నారన్నారు.
మంత్రి పొంగులేటి మాటలతో ఇది దద్దమ్మ ప్రభుత్వమని తేలిపోయిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నదని అపోహ పడుతున్నారని తెలిపారు. మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తు న్నది ముఖ్యమంత్రేనని ఆరోపించారు. రాత్రులు కాంగ్రెస్ గుండాలు బైక్‌లపై హల్ చల్ చేస్తూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగయ్య ఉన్నారు.