11 April, 2026 | 3:31 PM

Breaking News

ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •  

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

12-02-2026 03:01 AM
  1. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మహాదేవప్ప కుటుంబ సభ్యులను పరామర్శించిన కేంద్ర మంత్రి 

బాధితు కుటుంబానికి రూ.10 లక్షల విలువైన చెక్కు అందజేత 

నారాయణపేట. ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): అధికార పార్టీ బెదిరింపుతో మన స్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నమక్తల్ మున్సిపల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ డీకే అరుణ, స్థానిక బీజేపీ నాయకులు కొండయ్యతో కలిసి చందాపూర్ గ్రామంలో మహదేవప్ప భార్య సత్యమ్మ, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ పక్షాన రూ. 10 లక్షల చెక్కును మృతుడి భార్యకు కేంద్ర మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  మహాదేవప్ప ఆత్మహత్య తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.పార్లమెంటు సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తాను తెలుగులో మాట్లాడడం జరిగిందని. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలియలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడినట్లు తెలిపారు.

తక్షణమే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మక్తల్ వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించమని ఆదేశించారని తెలిపారు.రాజకీయాల్లో బెదిరింపులు దిగడం మంచిది కాదని, బెదిరింపులతో  ఏం సాధిస్తారని ప్రశ్నించారు.మహాదేవప్ప మరణం బాధాకరమని.. ఆ కుటుంబం అధైర్యపడకుండా మృతుడి కుటుంబానికి బీజేఈ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సంఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి నిందితులను గు ర్తించి చట్టరీత్యా శిక్షించాలని డిమాండ్ చేశా రు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంట బీజేపీ నాయకులు నాగురావు నామాజీ, కొండయ్య, కొత్త కాపు రతంగపాండు రెడ్డి, స్థానిక నాయకులు బలరామిరెడ్డి, జయానందన్ రెడ్డి, చిట్యాల లక్ష్మణ్, బ్యాటరీ రాజు తదితరులు ఉన్నారు.