ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
21-03-2026 04:36 PM
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం 2026 -27 వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి అరకురని నిధులు ప్రకటించడంపై ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యకు ప్రార్థన ఇస్తామని ప్రకటించిన ప్రకటించిన ఆర్థిక బడ్జెట్లో కేవలం ఎన్ని శాతం నిధులు మాత్రమే విద్యా రంగానికి కేటాయించారు. యూనివర్సిటీలకు నిధులు కేటాయింపు లేదని విద్యారంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న బడ్జెట్లో నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని హిందూ కన్వీనర్ శశిధర్ అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో సాయికుమార్ మణికంఠ రమేష్ రాజు జగదీశ్వర్ విగ్నేష్ రాము తదితరులు ఉన్నారు




