21 March, 2026 | 9:53 PM

విశ్వమానవ సోదరభావాన్ని చాటేదే రంజాన్

21-03-2026 04:34 PM

సంపాదనలో కొంతభాగాన్ని పేదల ఆకలి తీర్చేందుకు కేటాయించడం మహొన్నతమైనది

మతసామరస్యాన్ని చాటేందుకు పండుగలు దోహదపడతాయి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

పాల్వంచ ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లింసోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కూనంనేని

పాల్వంచ,(విజయక్రాంతి): విశ్వమానవ సోదరభావాన్ని చాటేదే రంజాన్ ని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రంజాన్ పండుగ సంధర్భంగా శనివారం స్థానిక ఇందిరా కాలనీ వద్ద ఉన్న ఈద్గాల్లో ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కూనంనేని మాట్లాడుతూ దాతృత్వం, క్రమశిక్షణ, ధార్మికచింతనల కలయిక 'పవిత్ర రంజాన్'నీ, సంపాదనలో కొంతభాగాన్ని పేదల ఆకలి తీర్చేందుకు కేటాయించడం మహొన్నతమైనదన్నారు.

మతసామరస్యాన్ని చాటేందుకు పండుగలు దోహదపడతాయినీ, మతాలకతీతంగా కలిసి మెలిసి ప్రజలంతా ఉంటూ దేశ మౌలిక సూత్రాలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, వీశంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, నాయకులు శనగారపు శ్రీనివాసరావు, చెరుకూరి శేఖర్, md అస్లాం తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం సోదరుల ఆతిథ్యం స్వీకరించిన ఎమ్మెల్యే కూనంనేని

ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్న అనంతరం పట్టణ పరిధిలోని పలువురు ముస్లిములు వారి ఇంటికి కూనంనేని నీ ఆహ్వానించగా, కూనంనేని వారి ఆతిథ్యం స్వీకరించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి, చిన్నపిల్లలతో ముచ్చటించారు.