8 June, 2026 | 10:47 PM

పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి

08-06-2026 09:29 PM

మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్

యాదగిరిగుట్ట,(విజయకాంతి): తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని  అందులో భాగంగా పట్టణంలోని  వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని అభివృద్ధికి  సహకరించాలని మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 7,8, 9 వార్డులలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99రోజుల కార్యచరణ  ప్రణాళిక)లో భాగంగా ఆయా వార్డులలో సభ ఏర్పాటు చేసినారు.

 సాలిడ్ వెస్ట్ మేనేజిమెంట్ రూల్స్,జల్ సంచయ్ - జల్ భగీరత పథకం క్రింద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టుట,  మురికి కాలువల శుభ్రం చేయుట, పూడిక తీయు పనులు, వర్షాకాల సంసిద్ధత పై కార్యాచరణ ప్రణాళిక, మంచి నీటి సరఫరా మరియు నిర్వహణ, నీరు నిలువ ప్రాంతాల నివారణ మరియు పారిశుద్ధ్యం,  రోడ్ల నిర్వహణ మరియు వీది దీపాలు, మొక్కలు మరియు పర్యావరణ సంరక్షణ కార్యక్రమములు మరియు ఫిర్యాదుల పరిష్కారం. మొదలైన అంశాల పై చర్చించడం జరిగింది. 

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ మాట్లాడుతూ... ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని యాదగిరిగుట్టను అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం ఎంతో కృషి చేస్తుందని అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  కమిషనర్ బి శ్రీనివాస్, కౌన్సిలర్లు పెలిమెల్లి లావణ్య శ్రీధర్, కో ఆప్షన్ సభ్యులు రహీమ సలాం, షేక్ ఉస్మాన్ షరీఫ్, పోలీస్ అధికారి సి. కృష్ణ స్వామి వివిధ శాఖల అధికారులు, పురపాలక సంఘ కార్యాలయ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు.