పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్
* సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జాంగిర్
చౌటుప్పల్,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో దేశ ప్రజల పెనుబారం మోపుతున్న మోదీ సర్కార్ అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జాంగిర్ అన్నారు. సోమవారం రోజున చౌటుప్పల మండల జనరల్ బాడీ సమావేశంనీకి అధ్యక్షత వహించిన మండల కార్యదర్శి వర్గ సభ్యులు చిరిక సంజీవరెడ్డి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాంగిర్ పాల్గొని మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజల ను మరోసారి మోసం చేసిందని అన్నారు.
డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదల వల్ల అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని అన్నారు. నిత్యవసర ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే అని విరుచుకుపడ్డారు.
ఎన్నికల ముందు బిజెపి ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచం అని పదే పదే ప్రకటించినది అని గుర్తు చేశారు. ఫలితాలు వచ్చిన నెల రోజులలో ఇప్పటికీ మూడు దఫాలుగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమే అని అన్నారు. కేవలం ఓట్ల కోసం ఎన్నికల కోసం మోడీ అబద్ధాలు చెబుతున్నారని ప్రజలు భావిస్తున్నారని, ఇది విశ్వాస ఘాతకం, అవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.






