11 March, 2026 | 8:46 PM

ఉత్తమ ఫలితాల సాధన దిశగా గజ్వేల్

11-03-2026 04:57 PM

- పదవ తరగతి పరీక్ష కేంద్రాలు సిద్ధం

- గజ్వేల్ ఎంఈఓ కృష్ణ 

గజ్వేల్: గజ్వేల్ మండలంలో  పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి కృష్ణ తెలిపారు. మండల వ్యాప్తంగా మొత్తం 1559 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఇందులో 736 మంది బాలురు, 764 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 430 మంది బాలురు, 416 మంది బాలికలు కలిపి 985 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ప్రైవేట్ పాఠశాలల నుంచి 306 మంది బాలురు, 268 మంది బాలికలు కలిపి 574 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వివరించారు.

పరీక్షల నిర్వహణ కోసం గజ్వేల్ మండలంలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గజ్వేల్ ప్రభుత్వ హైస్కూల్ (బాయ్స్ హబ్), టీజీఎంఎస్ ముట్రాజ్ పల్లి (గర్ల్స్ హబ్), సెయింట్ జోసెఫ్ హైస్కూల్ గజ్వేల్, జెడ్పీహెచ్‌ఎస్ ప్రజ్ఞాపూర్ (బాయ్స్), జెడ్పీహెచ్‌ఎస్ ప్రజ్ఞాపూర్ (గర్ల్స్), సాయి జీడీఆర్ హైస్కూల్ గజ్వేల్, జెడ్పీహెచ్‌ఎస్ రిమ్మనగూడ, జెడ్పీహెచ్‌ఎస్ అహ్మదీపూర్ కేంద్రాలుగా ఉంటాయని తెలిపారు.

పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడతాయన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సమయానికి ముందే చేరుకోవాలని సూచించారు. బెల్ట్‌లు, ఆభరణాలు వంటి అనుమతి లేని వస్తువులు తీసుకురావద్దని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని మండల విద్యాధికారి వై. కృష్ణ కోరారు