11 March, 2026 | 8:49 PM

పశువులకు టీకాలు వేసిన సర్పంచ్

11-03-2026 04:52 PM

గాలికుంటు టీకాలతో పశువులు ఆరోగ్యంగా ఉంటాయి పశు వైద్యాధికారిని అర్చన

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): పశువులకు ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వ పశు వైద్యాధికారి అర్చన గాలి,కుంట టీ కాలను వేశారు. ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామంలో సర్పంచ్ సందీప, గ్రామంలోని పశువులకు పశువైద్యాధికారిని అర్చనతో కలిసి గేదెలకు ఆవులకు టీకాలు వేశారు. రుద్రారం గ్రామంలో 158 ఆవులు 122 గేదెలకు మొత్తం 280 పశువులకు టీకాలు వేసినట్లు పశు వైద్యాధికారిని అర్చన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట సిబ్బంది అనిల్ మహబూబ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.