9 July, 2026 | 2:14 AM

గాంధీ ట్రస్ట్ భూమిలో ప్రైవేట్ పట్టాలు నిజమేనా?

09-07-2026 12:00 AM

అక్రమ నిర్మాణాలు అంటున్న పుర ప్రముఖులు 

హైకోర్టుకు ఇచ్చిన సమాచారం సరైనవా అంటూ సందేహాలు 

నాటి నుంచి తొలగని గాంధీ ట్రస్టు భూమి పంచాయతీ 

మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలే : మున్సిపల్ కమిషనర్, జడ్చర్ల 

జడ్చర్ల, జూలై 8: గాంధీ ట్రస్ట్ భూముల్లో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పుర ప్రముఖులు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూముల్లో ప్రైవేటు భూములు ఉన్నాయా? ఆ ప్రైవేట్ పట్టాలలోనే నిర్మాణాలు జరుగుతున్నాయా అనే సందేహానికి సమాధానం దొరికిన ప్రశ్నగా పుర ప్రజలకు అంత చిక్కడం లేదని తెలుస్తుంది.

మున్సిపల్ అధికారులు మాత్రం ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టేందుకు తాము ఇటీవల ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదని అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం అడుగు పడడం లేదని తెలుస్తుంది. గతంలో ఇచ్చిన అనుమతులకు తమకు సంబంధం లేనట్టు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారని జడ్చర్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండ్రు. ట్రస్ట్ భూములను వివిధ ప్రజల అవసరాలకు వినియోగించేది పోయి ఎవరి పడితే వారు నిర్మాణాలు కొనసాగించేలా వెనుక ఉండి అధికారులు ఎప్పుడు వస్తాయి ఎంతవరకు సమంజసం అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

కోర్టు చుట్టూ తిరుగుతున్న గాంధీ ట్రస్ట్ భూములు 

గాంధీ ట్రస్ట్ భూముల్లో ఎవ్వరు కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదని ఈ భూములు పూర్తిస్థాయిలో ట్రస్ట్ కు సంబంధించిన అంటూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో అలాంటి నిర్మాణాలు జరగడంలేదని సంబంధిత మున్సిపల్ అధికారులు సైతం సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఇక్కడ మాత్రం ట్రస్టు భూమి లోనే నిర్మాణాలు జరుగుతున్నాయని, ఓటుకు అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలకు ముగింపు పలకాలంటే సమగ్ర విచారణ జరిగితే ట్రస్టు భూముల్లో ప్రైవేటు భూములు ఉన్నాయా లేదా తెలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

 అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?

జడ్చర్ల పురపాలక లో అతి విలువైన స్థలంలో గాంధీ ట్రస్టు భూములు ఉన్నాయి. ఈ భూముల్లో ఎవరు కబ్జాలు గురి కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ నామమాత్రంగా చర్యలు తీసుకోవడం ఆ తర్వాత అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్లడం అధికారులకు పారపాటుగా మారింది. ఈ క్రమంలో ఎవరికి వారు కొందరు ఈ భూములు మావే అంటూ పట్టాలు ఉన్నాయంటూ నిర్మాణాలు చేపడుతూ అనుమతులు పొందుతున్నారని ఇది సరైన పద్ధతి కాదంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ భూములపై ఎంత మేరకు ప్రైవేట్ భూములు ఉన్నాయి? ట్రస్ట్ భూముల లెక్క తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

అక్రమ నిర్మాణాలను కట్టనివ్వం 

 గాంధీ ట్రస్ట్ భూములలో ఎట్టి పరిస్థితిలో అక్రమ నిర్మాణం చేపట్టనివ్వం. అలా ఎవరైనా చేస్తే ఎంతటి నిర్మాణాన్ని అయినా కూల్చివేస్తాం. గతంలో గాంధీ ట్రస్టు భూముల పరిధిలోనే కొందరికి పట్టాలు ఉన్నాయని తెలుస్తుంది. మేము ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు గతంలో ఇచ్చిన విషయం పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం. ట్రస్ట్ భూముల జోలికి ఎవరు పోకూడదు. 

 గిరీష్,

మున్సిపల్ కమిషనర్, జడ్చర్ల