31 August, 2026 | 11:00 AM

Breaking News

ఎమ్మెల్యే పద్మావతి చొరవతో డబ్బాకొట్టు తిరిగి ఏర్పాటు

31-08-2026 09:44 AM

కోదాడ ఆగస్టు 30,(విజయ క్రాంతి): పట్టణంలో డబ్బాకొట్టుతో జీవనోపాధి కోల్పోయిన మహిళ గంధం కనకమ్మ ఆర్థిక పరిస్థితిని యాదవ సంఘాల నాయకులు ఆదివారం ఎమ్మెల్యే పద్మావతి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పద్మావతి మున్సిపల్ అధికారులతో మాట్లాడి యధావిధిగా డబ్బాకొట్టును ఏర్పాటుచేయించారు.

బాధిత మహిళపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు తీసుకున్నారని, మానవతా ధృక్పదంతో మహిళకు అవకాశం కల్పించాలని యాదవ సంఘాల నాయకుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే చొరవ తీసుకొని యధావిధిగా డబ్బాకొట్టు ఏర్పాటుచేయించిందుకు పలువురు నాయకులు ఎమ్మెల్యే పద్మావతికి కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్నేని బాబు, కౌన్సిలర్ పాశం శ్రీనివాసరావు, యాదవ సంఘాల నాయకులు ఈదుల కృష్ణయ్య యాదవ్  కట్టేబోయిన శ్రీనివాస్ యాదవ్, బడేటి వెంకటేశ్వర్లు యాదవ్, మోడే సైదిబాబు యాదవ్  గుండెల సూర్యనారాయణ యాదవ్,  బారి వెంకన్న యాదవ్,  గునుగుంట్ల గురుమూర్తి యాదవ్ ,  లిక్కి వెంకటయ్య యాదవ్,  లిక్కి రామరాజు యాదవ్ లు మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మావతికి కృతజ్ఞతలు తెలిపారు.