31 August, 2026 | 11:16 AM

ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు చాటేలా లేజర్‌ షో

31-08-2026 09:57 AM

అలంపూర్‌ ఆలయాల చరిత్రను ప్రపంచానికి పరిచయం చేస్తాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

అలంపూర్ ఆగస్టు 30: ప్రముఖ ఐదవ శక్తిపీఠం అలంపూర్‌ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో ప్రసాద్‌ స్కీమ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మల్టీమీడియా సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎంపీలు డీకే అరుణ,మల్లు రవి, ఎమ్మెల్యే విజేయుడు తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... అలంపూర్‌ ఆలయాలకు ఎంతో గొప్ప చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉందని అన్నారు.

ఆలయాల చరిత్ర, సంస్కృతి, హిందూ ధర్మ విశిష్టతను ఆధునిక సాంకేతికతతో ప్రజలకు వివరించేందుకు సౌండ్‌ అండ్‌ లైట్‌ షో ఉపయోగపడుతుందని తెలిపారు.అలంపూర్‌ క్షేత్రానికి దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు క్షేత్రం విశిష్టతను మరింతగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.ప్రసాద్‌ పథకం ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో అలంపూర్‌ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

ఇలాంటి కార్యక్రమాలు మన వారసత్వ సంపదను కాపాడుకోవడంతో పాటు భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని అన్నారు.అంతకుముందు కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఎంపీలు డీకే అరుణ, మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు బొకే అందించి స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రసాద్‌ స్కీమ్‌ అధికారులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.