31 August, 2026 | 11:10 AM

Breaking News

బీసీ సంక్షేమ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలిగా పానుగుళ్ల సుజాత

31-08-2026 09:54 AM

నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరణ

నాగోల్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పానుగుళ్ల సుజాతను తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. బీసీల సంక్షేమం, హక్కుల సాధన కోసం కృషి చేస్తానని పానుగుళ్ల సుజాత తెలిపారు. మహిళలను సంఘటితం చేసి బీసీ వర్గాల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘం నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.