31 August, 2026 | 11:00 AM

Breaking News

రాఖీ పండుగ విషాదం.. కుంటలో పడి అన్నదమ్ముల దుర్మరణం

31-08-2026 09:41 AM

ములుగు జిల్లాలో దుర్ఘటన 

ములుగు, ఆగస్టు 30 (విజయక్రాంతి): రాఖీ పండగకి తల్లితో కలిసి అమ్మమ్మ గారి ఇంటికి వచ్చిన ఇద్దరు విద్యార్థులు బహిర్భూమి కోసం కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి దుర్మరణం పాలైన ఘటన ములుగు జిల్లా కేంద్రం పరిధిలోని గణేష్ లాల్ పల్లి లో ఆదివారం జరిగింది. ఇదే జిల్లా మంగపేట మండలం కమలాపురం కు చెందిన మాలోతు స్వాతి తన తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు భర్త యాకూబ్, ఇద్దరు పిల్లలు రాజేష్ (15), వినయ్ (12) కలిసి గణేష్ లాల్ పల్లికి వచ్చింది.

రాఖీ కట్టిన తర్వాత స్వాతి, యాకూబ్ కమలాపురం వెళ్లిపోగా, ఆదివారం సెలవు రావడంతో అమ్మమ్మ గారి ఇంట్లో ఉండి మరుసటి రోజు వస్తామని పిల్లలిద్దరూ ఇక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో ఆదివారం బహిర్భూమికి కుంట వద్దకు వెళ్లిన వీరు అందులో పడి మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాఖీ పండుగ వేళ ఇద్దరు పిల్లల మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టారు.