గోదావరి మాతకు దివ్య హారతులు
గోదావరి తీరాన భక్తి పారవశ్యం
భద్రాచలం (విజయ క్రాంతి): భద్రాచలం దివ్య క్షేత్రంలోని పుణ్య గోదావరి స్నాన ఘట్టాల వద్ద శ్రావణ బహుళ విదియ ఆదివారం శ్రావణ మంగళ గౌరీ, శ్రావణ మహాలక్ష్మి ప్రీత్యర్ధం గోదావరి హారతి ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.
ఆదివారం నాడు సాయంత్రం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రం భద్రాచలంలోని గోదావరి కరకట్ట ప్రదేశాలలో జరిగిన నదీహారతి కార్యక్రమంలో బ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ రవికుమార్ పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ దివ్య క్షేత్రం భద్రాద్రిలో నిర్వహిస్తున్న గోదావరి హారతి గోదావరి మాతకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి భక్తి భావంతో స్నాన ఘట్టాల వద్ద ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం ప్రాంగణము నుండి పురోహితులు హారతులు సమర్పించడం జరిగిందని ఆయన అన్నారు.
అనంతరం పురోహితులు గోదావరి హారతి విశేషాలను విశిష్టతను భక్తులకు తెలిపి, గణపతి పూజ, దీపోత్సవం భక్తులచే సృష్టింప చేసి, పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేసి లోక కళ్యాణార్థం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహత్కార్యములో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామానుగ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొంది లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నందుకు ప్రజలు ఆయురారోగ్యం ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు.
అనంతరం శాంతి మంత్ర పఠనం జరిపి పాపకొల్లు వీరభద్ర శర్మ ప్రసాదం సమర్పించగా ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయడం జరిగినదని, నదిహారతి కార్యక్రమానికి పూజా సామాగ్రి రెడీమేడ్ బట్టల షాప్ అసోసియేషన్ భద్రాచలం వారు అందించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు పవన్ కుమార్ శర్మ, తిరుపతిరావు, పీ వి ఎస్ ఎన్ రెడ్డి, రామకృష్ణ, శివ బాబు, చంద్రశేఖర్ రామ్ చరణ్ తేజ, రామాచారి మరియు స్వచ్ఛంద సంస్థలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.






