గోపీచంద్ అకాడమీతో చుప్స్ భాగస్వామ్యం
హైదరాబాద్, జూలై 10: భారతదేశంలోని ప్రముఖ హై-పెర్ఫార్మెన్స్ బ్యాడ్మింటన్ ఇనిస్టిట్యూట్‌లలో ఒకటైన పి.గోపీచంద్ బ్యా డ్మింటన్ అకాడమీ (పిజిబిఎ)తో అధికారిక పోస్ట్-రికవరీ, అథ్లెజర్ ఫుట్‌వేర్ భాగస్వామిగా చుప్స్ ఒప్పందం చేసుకుంది. ఈ భాగ స్వామ్యం ఏడాది పాటు కొనసాగుతుంది. చుప్స్ ఫుట్‌వేర్ వ్యవస్థాపకుడు యశేష్ ము ఖి, పుల్లెల గోపీచంద్ సంయుక్తంగా ఈ భాగస్వామ్యాన్ని ప్రకటించారు. భారతదేశంలోని అత్యంత కఠినమైన శిక్షణా వాతావరణాల లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ అకాడమీలో క్రీడాకారులు ఎక్కువ గంటలు శిక్షణ పొందుతుంటారు.
వారి దినచర్యలో రికవరీ ఒక కీలకమైన భాగం. ఈ భాగస్వామ్యం ఆట గాళ్లకు కోర్టు వెలుపల సమయంలో చుప్స్ ఫుట్‌వేర్‌ను ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. క్రీడాకారులు, కోచ్‌ల నుంచి ని రంతరం అందే ఈ అభిప్రాయాలు, సూచనలు, చుప్స్ ఫుట్‌వేర్ తమ రికవరీ, అథ్లెజర్ విభాగాన్ని అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఉత్పత్తి రూపకల్పన, అభివృద్ధిని చేపట్టే విధానానికి తోడ్పడుతాయి. ప్రతి అథ్లెట్ ప్రయాణంలో రికవరీ అనేది ఒక ముఖ్యమైన భాగమనీ, అథ్లెట్లు కోలుకోవడానికి ఫుట్‌వేర్ కీలకంగా ఉంటుందన్నారు. గోపీచంద్ అకాడమీతో భాగస్వామ్యం సంతోషం గా ఉందని యశేష్ ముఖి తెలిపారు.






