11 July, 2026 | 1:42 AM

చెన్నైలో బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్

11-07-2026 12:00 AM

మోదీ సమక్షంలో ఆసీస్ ప్రధాని ప్రకటన

డిసెంబర్ 12న పెర్త్, మెల్‌బోర్న్ పోరు

మెల్‌బోర్న్, జూలై 10: భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ సంబంధాల్లో ఒక చారి త్రాత్మక ఘట్టానికి తెరలేవబోతోంది. ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్ తొలిసారి భారత గడ్డపై అడుగుపెట్టబోతోంది. రాబోయే 2026-27 బిగ్ బాష్ లీగ్ సీజన్ ప్రారంభ మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆస్బనీస్ ప్రకటించారు.

ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మెల్ బోర్న్ స్టేడియాన్ని సందర్శించినప్పుడు అధికారికంగా ప్రకటన చేశారు. ఆస్ట్రేలియా వెలుపల, ముఖ్యంగా భారత గడ్డపై ఒక బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి. క్రికెట్‌కు అత్యంత ఆదరణ ఉన్న భారత్‌లో ఈ లీగ్‌ను ప్రదర్శించడం ద్వారా సరికొత్త మార్కెట్‌ను సృష్టించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. అంతేకాకుండా, బిగ్ బాష్ లీగ్ క్లబ్‌లో విదేశీ పెట్టుబడులను ముఖ్యంగా ఐపీఎల్ ఫ్రాంచైజీల నుండి ఆకర్షించే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్తో కలిసి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ను మోదీ సందర్శించారు. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య క్రీడల్లో సహకారం కోసం ఎంసీజీ మైదానంలో రోడ్మ్యాప్ను విడుదల చేశారు. “బిగ్బాష్ లీగ్ మ్యాచ్ను చెన్నైలో నిర్వహించేందుకు సాదరంగా ఆ హ్వానిస్తున్నా. భారత్ వేదికగా ఎలాంటి లీగ్ అయినా సరే అభిమానులకు బాగా చేరువవుతుంది. వ్యూయర్షిప్ కూడా అద్భుతంగా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను” అని మోదీ వ్యాఖ్యానించారు.