11 July, 2026 | 2:43 AM

అండర్-17 బ్యాడ్మింటన్ పోటీలు షురూ

11-07-2026 12:00 AM

హైదరాబాద్, జూలై 10: తెలంగాణలోని ప్రతిభావంతులైన యువ షట్లర్ల కోసం వేదికగా నిలిచే యోనెక్స్- సన్రైజ్ 12వ రాష్ట్ర సబ్ జూనియర్ (అండర్-17) బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్- 2026 జేఎస్‌కే -చేతన్ ఆనంద్ స్పోర్ట్స్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన అండర్-17 షట్లర్లు సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబు ల్స్ విభాగాల్లో తమ ప్రతిభను చాటనున్నారు.

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో, వికారాబాద్ జిల్లా బ్యా డ్మింటన్ అసోసియేషన్ సమన్వయంతో ని ర్వహిస్తున్న ఈ చాంపియన్‌షిప్ రాష్ట్రంలోని యువ ప్రతిభకు వేదికగా నిలుస్తోంది. టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులతో పాటు, జాతీయ స్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించనున్నారు.