24 June, 2026 | 12:25 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

అగ్రరాజ్యానికి చైనా షాక్

23-06-2026 12:00 AM
  1. 10 కంపెనీలపై ఆంక్షలు విధింపు
  2. అమెరికా తీసుకుంటున్న చర్యలకు దీటుగా నిర్ణయం

బీజింగ్, జూన్ 22: అగ్రరాజ్యమైన అమెరికాకు చైనా షాక్ ఇచ్చింది. అమెరికాకు చెందిన పలు కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది. దీంతో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. అమెరికా ఎగుమతుల నియంత్రణలకు ప్రతిస్పందనగా చైనా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.అమెరికాకు చెందిన 10 కంపెనీలపై ఎగుమతి నియంత్రణలు విధించిన చైనా, మరో 46 సంస్థలను ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియల నుంచి నిషేధించింది.

ఆ దేశానికి చెందిన కంపెనీలను తమ ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియల నుంచి పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇతర కీలక రంగాల్లోలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలకు దీటుగా చైనా ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది.అమెరికా తీసుకుం టున్న చర్యలకు ప్రతిస్పందనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా ప్రకటించింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం,అమెరికాకు చెందిన కొన్ని రక్షణ రంగ సంస్థలు, డ్రోన్ తయారీ కంపెనీలు,ఇతర సంస్థలకు ద్వంద్వ వినియోగ (డ్యూయల్-యూజ్) ఉత్పత్తుల ఎగుమతిని నిలిపివేశారు. ఈ జాబితాలో అవియాక్స్,రెడ్ క్యాట్ హోల్డింగ్స్ , టీయల్ డ్రోన్స్, జయా రోబోటిక్స్ వంటి సంస్థలు ఉన్నాయి.

పౌర, సైనిక అవసరాలకు ఉపయోగపడే సాంకేతికతలు, పదా ర్థాలు, ఉత్పత్తులను ఈ కంపెనీలకు సరఫరా చేయడాన్ని చైనా నిషేధించింది. కాగా ఈ సంవత్సరం మే నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటించిన సంగతి విదితమే. ఆ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయిన ట్రంప్.. ఇరుదేశాల మధ్య పరస్పర వాణిజ్య సహకారంపై అంగీకారానికి వచ్చారు. అయితే నెల తిరక్కుండానే బీజింగ్ కంపెనీలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించడం గమనార్హం. దీంతో చైనా కూడా ప్రతి చర్యలు చేపట్టింది.