23 June, 2026 | 10:18 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి

23-06-2026 09:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పల్స్ పోలియో నివారణలో భాగంగా 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 28వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు.

ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, పోలియో చుక్కల ప్రాధాన్యతను వివరించాలని చెప్పారు. జూన్ 28వ తేదీ తర్వాత కూడా సిబ్బంది ఇంటింటికి వెళ్లి, చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. అలాగే రానున్న నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.

వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.