బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!
బ్రిటన్ ప్రధానిగా వైదొలుగుతున్నట్లు కీర్ స్టార్మర్ ప్రకటన
లండన్: బ్రిటన్ ప్రధానిగా వైదొలుగుతున్నట్లు కీర్ స్టార్మర్ ప్రకటన చేశారు. కీర్ స్టార్మర్ 2024లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని పదవిలో విలువలకు కట్టుబడి పనిచేశానని కీర్ స్టార్మర్ వెల్లడించారు. ప్రధానిగా కీర్ స్టార్మర్ తప్పుకుంటారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) నిన్న చెప్పారు. పదేళ్లలో ప్రధాని పదవి నుంచి వైదొలిగిన ఆరో ప్రధానిగా కీర్ స్టార్మర్(UK Prime Minister Keir Starmer resignation) నిలిచారు.
స్టార్మర్ రాజీనామా ప్రకటించడంతో, ఆ కీలక పదవిని చేపట్టే రేసులో ఆండీ బర్న్‌హామ్(Andy Burnham) ముందున్నారు. స్టార్మర్(Keir Starmer resignation) సోమవారం తన రాజీనామాను ప్రకటించి, కొన్ని రోజుల అనిశ్చితికి తెరదించారు. నాయకత్వంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం ఆసన్నమైందని, తన వారసుడికి పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. పార్టీ భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, అధికార బదిలీ సజావుగా, క్రమబద్ధంగా జరిగేలా చూస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.






