23 June, 2026 | 11:19 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు

23-06-2026 12:00 AM
  1. 1౩ మంది కార్మికులు మృతి
  2. మృతుల్లో 12 మంది భారతీయులే..
  3. 66 మందికి గాయాలు

దోహా, జూన్ 22: ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చడంలో అత్యంత ముఖ్యమైన ఖతార్‌లోని ‘రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ’లో ఆదివారం రాత్రి భారీ పేలుడు సం భవించింది. అక్కడి బర్జాన్ గ్యాస్ సరఫరా ప్లాంట్‌లో ఆపరేషన్లను, ఎగుమతులను తిరిగి ప్రారంభించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తుండగా పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ౧౩ మంది కార్మికులు దుర్మరణం చెందారు. మృతుల్లో ౧౨ మంది భారతీయులు.

మరొక రు పాకిస్థానీయుడు ఉన్నారు. ౬౬ మందికి గాయాలయ్యాయి. మరికొందరి ఆచూకీ గల్లంతైనట్లు ఖతర్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పేలుడు ధాటికి ఆకాశంలోకి దట్టమైన నల్లటి పొగ, మంటలు కిలోమీటర్ల దూరం వరకు కనిపించడంతో రాజధాని దోహా నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం ఖతర్ సెర్చ్ అండ్ రెస్క్యూ గ్రూప్ గల్లంతైన కార్మికుల కోసం ప్లాంట్ శిథిలాల మధ్య ముమ్మరంగా గాలిం పు చర్యలు చేపడుతోంది.

ఈ పేలుడు వల్ల ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ము ప్పు తెచ్చే ప్రమాదకర గ్యాస్ లీకేజీలు కాలేదని అధికారులు ప్రాథమికంగా ప్రకటించా రు. భారత ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో ఖతర్ నుంచి 40 వరకు హోర్ముజ్ జలసంధి దాటుకొని వస్తున్నాయి. భారత్, ఖతర్ మధ్య 2024లో 78 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం జరిగింది.