కొడంగల్‌లో నేడు ముఖ్యమంత్రి పర్యటన
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ ఉన్నాదికారులు
రూ.110 కోట్లతో వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిమానానికి భూమి పూజ
కొడంగల్, మే 7 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో పర్యటించనున్నారు. సీ ఎం పర్యటన పురస్కరించమని పట్టణం సరికొత్త శోభను సంతరించుకుంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నత అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. రూ. 110కోట్లతో ఆధ్యాత్మిక వైభవంగా చేపట్టే వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ శంకుస్థాపన చేయనున్నరు.
కొడంగల్ పట్టణంలోని చారిత్రాత్మక శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పనర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేయనున్నారు తిరుమలలో తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ప్రభుత్వ అధికారులు పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టారు. పట్టణ సుందరీకరణతోపాటు రెవెన్యూ మరియు మున్సిపల్ శాఖ సమన్వయంతో పనిచేయాలని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.






