ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
03-05-2026 10:56 AM
హైదరాబాద్: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం(World Press Freedom Day) సందర్భంగా పాత్రికేయ సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ, సత్యాన్వేషణ, సమాజహితానికి పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. నిబద్ధత, ధైర్యం, బాధ్యతతో పనిచేసే పాత్రికేయులు(Journalists) సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని అన్నారు. ప్రజల గొంతుకగా నిలిచి, సమాజ పురోగతికి తోడ్పడుతున్న పత్రికా రంగానికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలియజేశారు.






