8 July, 2026 | 1:33 AM

‘సర్’లో ఓటర్లు నమోదు చేసుకోవాలి

08-07-2026 12:29 AM

మల్కాజిగిరి బిఆర్‌ఎస్ పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి

మేడ్చల్ అర్బన్ జూలై 7(విజయక్రాంతి):కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంలో ఓటర్ లు భాగస్వాములై  ఓటు లేనివారు ఓటు నమోదు చేసుకోవాలని మల్కాజిగిరి బిఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 298 వ డివిజన్ లకు సంబంధించిన కిస్టాపూర్,పూడూరు డివిజన్ లోని బూత్ నంబర్ 79,80 ఓ.ఎన్.జి.సి కాలనీలో బిఆర్‌ఎస్ పార్టీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ నడికొప్పు ఉమా నాగరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో సర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మల్కాజిగిరి బిఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటు ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి,మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డిల చేతుల మీదుగా సర్ పత్రాన్ని ఓటర్లకు అందించినట్లు ఆమె చెప్పారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ మల్లికార్జున స్వామి.మేడ్చల్ జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్.మేడ్చల్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అకిటి నవీన్ రెడ్డి.మహబూబ్ అలీ.బూత్ ఏజెంట్లు నడికొప్పు నాగరాజు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.