8 July, 2026 | 1:18 AM

సైబరాబాద్ కమిషనర్ సృజన ఆకస్మిక పర్యటన

08-07-2026 12:28 AM

మేడ్చల్ అర్బన్ జూలై 7(విజయక్రాం తి):మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ పరిధిలోని గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణంలోని డివిజన్ లో సైబరాబాద్ కమిషనర్ సృజన ఆకస్మికంగా పర్యటించా రు. మున్సిపల్ పట్టణ పరిధిలోని పలు డివిజన్ లలో మౌలిక సదుపా యాలు, రోడ్ల మరమ్మత్తులు,అంతర్గత మురికి కాలువలు,వీధి దీపాలు,సీసీ రోడ్లు,ఇందిరమ్మ ఇళ్లు,పెన్షన్ లను వెంటనే అమలు చేయాలని అధికారులను పనులు ప్రారంభించాలని కమి షనర్ కు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గరిసెల సురేందర్ ముదిరాజ్ కోరినట్లు చెప్పారు.

మంగళవారం గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణానికి విచ్చేసిన సైబరాబాద్ కమిషనర్ సృజనను డివిజన్ లో ఏర్పాటు చేసిన‘వన్ వర్డ్ ఎవరీ యాక్షన్‘పేరుతో మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించి పూల బొకే అందినట్లు స్పష్టం చేశారు.అదేవిధంగా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీ సర్పంచ్ బేరీ ఈశ్వర్ కమిషనర్ ను కోరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి, మేడ్చల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, మాజి కౌన్సిలర్లు హంసరాణి కృష్ణ గౌడ్, హేమంత్ రెడ్డి, మోహన్, నాయకులు రవి కుమార్, కావేరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.