జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్యాంప్ కు చరణ్ ఎంపిక
03-05-2026 10:49 AM
జగిత్యాల,(విజయక్రాంతి): ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్ బాస్కెట్ బాల్ సెలెక్షన్స్ లో జగిత్యాలకు చెందిన చెందిన చరణ్ జగిత్యాల లోని ఓల్డ్ హై స్కూల్ మైదానంలో కోచ్ విశ్వప్రసాద్ వద్ద శిక్షణ పొందుతూ ఈ నెల 4 నుండి 20 వరకు హైద్రాబాద్ లోని వాక్సాన్ యూనివర్సిటీ లో జరిగే జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్యాంపు కు ఎంపికైనట్లు జగిత్యాల జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు ఈ నెల 22 నుండి 29 వరకు పుదుచ్చేరిలో ఉన్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారున్ని అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి,పిడి లు కృష్ణ ప్రసాద్, అజయ్, సాగర్, వేణు,సీనియర్ క్రీడాకారులు, తదితరులు అభినందించారు.






