13 March, 2026 | 1:14 PM

ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

13-03-2026 12:16 AM

గాంధారి, మార్చి 12 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని పలు గ్రామాలకు మహిళా సంఘాల భవనాలను మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా పలు గ్రామాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తిప్పారం గ్రామంలో గ్రామ సర్పంచ్ సోలంకి ప్రమోద మాధవరావ్, ఉప సర్పంచ్, పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో బుధవారం నాడు ముఖ్యమంత్రి , ఎమ్మెల్యే ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ప్రమోద మాధవరావ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ ప్రత్యేక కృషి వల్లనే నియోజక వర్గంలో పెద్ద ఎత్తున మహిళా సంఘాల భవనాలకు నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. మహిళా సంఘం భవనం తమ గ్రామానికి మంజూరు చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోలంకి మాధవరావు, మహిళా సమైక్య అధ్యక్షురాలు, ఐకెపి అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.