29 July, 2026 | 2:11 AM

సెంట్రల్ లైబ్రరీలో బోనాలు

29-07-2026 01:18 AM

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో టీఎన్‌జిఓస్ యూనియన్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ యూనిట్ అధ్యక్షుడు కేసరి హనుమాన్, కార్యదర్శి అబ్దుల్ అజీజ్, చీఫ్ లైబ్రేరియన్ పీజివి రాణి ఆధ్వర్యంలో బోనాల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి టీఎన్‌జిఓస్ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి డా. ఎస్‌ఎం హుస్సేనీ (ముజీబ్) ముఖ్య అతిథిగా హాజరై బంగారు మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.  ఈ సందర్భంగా హుస్సేనీని శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీఎన్‌జిఓస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ అధ్యక్షుడు కెఆర్ రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు బొలిగిద్ద శంకర్, ప్రచార కార్యదర్శి వైదిక్ శాస్త్రి, ఈసీ సభ్యులు ముకీద్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ యూనిట్ ఉపాధ్యక్షురాలు సి. అపర్ణ (గెజిటెడ్ లైబ్రేరియన్), సంయుక్త కార్యదర్శి రాకేష్, సంయుక్త కార్యదర్శి ఎం. శ్రీకాంత్ పాల్గొన్నారు. రమ్య, అనిత, రవి, ఉమా మహేశ్వర్‌రెడ్డి, విక్రమ్, మహేష్, దీక్షిత్, నరేందర్, అబ్దుల్ అతర్ పాల్గొన్నారు.