4 July, 2026 | 9:28 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

చెన్నపురాన్ని ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి

01-01-2026 12:44 AM

మంత్రి శ్రీధర్‌బాబుకు వినతి

జవహర్ నగర్, డిసెంబర్ 31(విజయక్రాంతి) : జవహర్నగర్ పరిధిలోని అంబేద్కర్ నగర్ నుండి. చెన్నపురం వరకు ఉన్న సుమారు 50 కాలనీలను కలిపి ఒక ప్రత్యేక గ్రేటర్ హైదరాబాద్ డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక నాయకులు మరియు కాలనీవాసుల బృందం. బుధవారం  మేడ్చల్ మల్కాజిగిరి ఇంచార్జ్. ఐటీ మంత్రి దుద్ధిల్లా శ్రీధర్ బాబు ని కలిసి వినతి పత్రం అందజేశారు. అభివృద్ధిలో వెనుకబాటు గత 30 ఏళ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని, జవహర్నగర్ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడి ప్రజలు తీవ్రమైన దుర్వాసనతో, ఆరోగ్య సమస్యలతో నరకయాతన అనుభవిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

లక్షకు పైగా జనాభా, 50కి పైగా కాలనీలు ఉన్నప్పటికీ, ఈ ప్రాంతాన్ని ప్రత్యేక డివిజన్గా గుర్తించకపోవడం వల్ల పాలన పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.ప్రతినిధుల విన్నపాన్ని సావధానంగా విన్న మంత్రి, ఈ ప్రాంత సమస్యలపై సానుకూలంగా స్పందించారు. నూతన డివిజన్ల ఏర్పాటు ప్రక్రియలో అంబేద్కర్ నగర్ - చెన్నపురం ప్రతిపాదనను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రత్యేక డివిజన్ ఏర్పాటైతేనే తమ ప్రాంతానికి నిధులు మంజూరై, మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని వారు వ్యక్తం చేశారు. గూడెల్లి సురేష్ ముదిరాజ్. మాజీ ఎంపిటిసి పంతంగి సిద్దులు యాదవ్.దంతూరి శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు.