4 July, 2026 | 10:58 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

2026 రిపబ్లిక్ డే పరేడ్-కి ఎంపికైన వ్యవసాయ కళాశాల విద్యార్థిని

01-01-2026 12:44 AM

పలువురు అభినంధనలు

అశ్వారావుపేట డిసెంబరు 31(విజయ క్రాంతి): జనవరి 1 నుండి 31వ తేదీవరకు డిల్లీలో జరిగే డిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపుకు ఆశ్వా రావుపేట వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ శ్రావణం కావ్యశ్రీ .ఎం పికయ్యారు. బుధవారం కళాశాలలో కావ్యశ్రీకి ఎంపికైన ధృవీకరణ పత్రాన్ని కళాశాల అసోసియేట్ డీన్ డా. హేమంత్ కుమార్ అందజేసారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అక్టోబరు 31వ తేదీనుండి నవంబర్ 9వ తేదీవరకు నార్త్ గుజరాత్ యూనివర్శిటీలో జరిగిన విశ్వవిద్యాలయ ం మరియు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో కావ్యశ్రీ గెలుపొందింది.

ఈ ఎంపికలో గెలుపొంది డిల్లీలో జరిగే రిపబ్లికి పరేడ్ క్యాంపుకు ఎంపికై కళాశాలకు పేరుతెచ్చారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ హేమంత కుమార్ మాటాడుతూ క్రమశిక్షణ, సేవా బావం, నాయకత్వ లక్షణాలు, జాతీయ స్ఫూర్తితో ఆమె సాదించిన ఈ విజయం కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు. ఈమెను ఆదర్శంగా తీసుకొని ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో విద్యార్థులు మరింత చురుకుగా పాల్గొనాలన్నారు. ఈ విజయానికి కారణమైన ఎన్‌ఎస్‌ఎస్ 13. ప్రోగ్రాం ఆఫీసర్లు డి స్రవంతి. పీ ఝాన్సీరాణి, అధ్యాపకులను ఆయన అభినందించారు.