చెన్నై జోరుకు గుజరాత్ బ్రేక్ వేస్తుందా?
ఈ మ్యాచ్‌కూ ధోనీ లేనట్టే
ఒత్తిడిలో గుజరాత్ టైటాన్స్
చెన్నై, ఏప్రిల్ 25: ఐపీఎల్ 19వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. హోంగ్రౌండ్ చెపాక్ స్టేడి యం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది. వరుస పరాజయాల నుంచి కోలుకుని గెలుపు బాట పట్టిన చెన్నై ప్రస్తు తం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకోకుండా ఉండాలంటే ఇకపై జరిగే మ్యాచ్ లన్నీ కూడా సీఎస్కేకు కీలకమే. పైగా హోంగ్రౌండ్ కావడంతో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న చెన్నై మరో విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లోనూ ధోనీ ఆడడం లేదని సమాచారం. అతను గాయం నుంచి కోలుకుంటున్నాడనీ, తాము తొందరపడడం లే దంటూ సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్ చెప్పాడు. కెప్టె న్ రుతురాజ్ పేలవ ఫామ్‌పై తమకు ఆందోళన లేదన్నాడు. ఒక్క మ్యాచ్‌తో రుతురాజ్ కూడా ఫామ్ అందుకుంటాడని ఫ్లెమింగ్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే చెన్నై ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్ లో సంజూ శాంసన్ గత మ్యాచ్ లో శతక్కొట్టాడు. అటు బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో ముంబైని వారి హోంగ్రౌండ్ లోనే చిత్తు చేసింది. ఈ విజయంతో సీఎస్కే కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఇప్పుడు చెపాక్ స్టేడియంలో తమ ఆధిపత్యం కొనసాగిస్తే మ రో విజయాన్ని అందుకోవడం ఖాయం. ఆ యుశ్ మాత్రే లాంటి ప్లేయర్ దూరమవడం చెన్నైకి ఇబ్బందిగానే ఉన్నా మిగిలిన ఆటగాళ్లు ఫామ్ అందుకోవడంతో రిలీఫ్‌ను ఇస్తోంది.
ముఖ్యంగా స్పిన్నర్ అకిల్ హొస్సేన్ ఇప్పుడు చెన్నైకి కీలక ప్లేయర్‌గా చెప్పొచ్చు. అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడం ఖా యం. మరోవైపు గుజరాత్ టైటాన్స్ వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉంది. హ్యాట్రిక్ విజయాల తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోవడం గుజరాత్‌కు షాక్ గానే చెప్పాలి. గత మ్యాచ్‌లో బెంగళూరుపై భారీస్కోరు చేసినా ఓడిపోయింది. సాయి సుద ర్శన్, గిల్ ఫామ్‌లో ఉండగా.. తర్వాత బ్యాటర్లలో బట్లర్, వాషింగ్టన్ సుందర్, హోల్డర్ పై అంచనాలున్నాయి.
అటు బౌలింగ్‌లో రబా డ, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ సమిష్టిగా రాణించడంలో విఫలమవుతున్నారు. స్పిన్నర్ రషీద్ ఖాన్ వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. బౌలర్లు గాడిన పడితే తప్ప గుజరాత్ టైటాన్స్‌కు గెలుపు దక్కడం కష్టమే. కాగా మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న చెపాక్ స్టేడి యం గత కొన్ని సీజన్లుగా బ్యాటర్లకు అనుకూలిస్తోంది. అయితే ఈ సారి స్లో పిచ్‌ను రెడీ చేసే అవకాశముందని సమాచారం. ఇక గత రికార్డుల విషయానికొస్తే ఇరు జట్లు 8 మ్యాచ్‌లలో తలపడితే సగం గెలిచాయి.
తుది జట్లు అంచనా
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, సర్ఫరాజ్‌ఖాన్, బ్రెవిస్, దూబే, కార్తీక్ శర్మ, ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మ ద్, గుర్జప్‌నీత్ సింగ్, ముకేశ్ చౌదరి
గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్, వాషిం గ్టన్ సుందర్, హోల్డర్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మాన వ్ సుతార్, రబాడ, సిరాజ్






