15 May, 2026 | 1:52 AM

క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్

15-05-2026 12:59 AM

బ్యాంకాక్, మే 14 : థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లు దూసుకెళుతున్నా రు. మహిళల సింగిల్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రీ క్వార్టర్స్‌లో ఆమె 21 స్కోర్‌తో డెన్మార్క్ ప్లేయర్ అమేలీ స్కల్జ్‌పై విజయం సాధించింది. సింధు కేవలం 28 నిమిషాల్లో ఈ మ్యాచ్‌ను ముగించింది. క్వార్టర్ ఫైనల్లో సింధు టాప్ సీడ్, జపాన్ ప్లేయర్ యమగుచితో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ లో భారత స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ కూడా క్వా ర్టర్స్ చేరుకున్నాడు.

ప్రీ క్వార్టర్స్‌లో 21 21 స్కోరుతో చైనాకు చెందిన చెన్‌పై గెలుపొందాడు. అటు పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్,చిరాగ్ షెట్టి జోడీ కూడా ముందంజ వేసింది. ఆసక్తికరం గా సాగిన మ్యాచ్‌లో టాప్ సీడ్ సాత్విక్ జోడీ 21 21 స్కోరుతో మలేషియాకు చెందిన బ్రయాన్ జెర్మి హైకల్ జంటపై గెలుపొందింది. క్వార్టర్ ఫైనల్లో భారత జోడీ ఆరో సీడ్ జపాన్‌కు చెందిన టకుమి జోడీతో తలపడుతుంది.