31 August, 2026 | 6:48 PM

Breaking News

ఎన్నికల హామీలు అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా   •   సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి   •   లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో సాధించాలి   •   అంధత్వాన్ని నివారించాలి: అదనపు కలెక్టర్ విక్టర్   •   చిరుతపులి సంచారం... వెంకంపల్లి గ్రామస్తులు ఆందోళన   •   పర్యావరణం పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ప్రజా ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి   •   అభివృద్ధిలో కరీంనగర్‎ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: బండి సంజయ్   •   శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి   •   రైల్వే హబ్ గా గద్వాల జిల్లా అభివృద్ధి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.   •  

చిరుతపులి సంచారం... వెంకంపల్లి గ్రామస్తులు ఆందోళన

31-08-2026 05:50 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని వెంకంపల్లి గ్రామ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. వెంకంపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే రైతు సోమవారం తన వ్యవసాయ పొలానికి వెళ్తుండగా చిరుతపులి(Leopard) కనిపించిండంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. చిరుత పక్కనే ఉన్న గుట్టపైకి వెళ్లినట్లు గమనించిన గ్రామస్తులు, సర్పంచ్ చిలుకూరి జ్యోతి సురేందర్ రెడ్డి ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు ఫారెస్ట్ ఎఫ్ఆర్వో వాసుదేవ్(Forest FRO Vasudev) తెలిపారు. వెంకంపల్లి గ్రామ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపడంతో స్థానికుల్లో ఆందోళన భయం నెలకొంది. ఫారెస్ట్ అధికారులు బోన్ ఏర్పాటుచేసి చిరుత పులిని పట్టుకోవాలని అధికారులను కోరారు.