31 August, 2026 | 4:58 PM

శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి

31-08-2026 03:47 PM

ఆలయ నిర్మాణానికి భూమిపూజ

గణపురం,ఆగస్టు 31 (విజయ క్రాంతి): పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హాజరై భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు లంక రాజేశ్వరరావు శర్మ, కిషన్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్,  తెలంగాణ రాష్ట్ర మెపా వ్యవస్థాపకుడు పులి దేవేందర్ ముదిరాజ్,  స్థానిక సర్పంచ్ పూజారి రాజేందర్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపెల్లి భాస్కర్ రావు, మాజీ జడ్పీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, మలహర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగిడి శ్రీనివాస్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు జోరుక సదయ్య ముదిరాజ్, ములుగు జిల్లా అధ్యక్షులు ఏర్ల వెంకన్న ముదిరాజ్, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి, ఉపాధ్యక్షులు చాడ కృష్ణస్వామి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు మంద మహేష్, బీజేపీ మోర్చా నాయకులు దుంపటి భద్రయ్య, బోయిని సాంబయ్య లు పాల్గొన్నారు.