31 August, 2026 | 6:59 PM

కొండపోచమ్మ ఆలయ నూతన ఈఓగా ముసినం మైసయ్య

31-08-2026 03:30 PM

జగదేవపూర్, (విజయక్రాంతి): జగదేవపూర్  మండల పరిధిలోని తీగుల్‌ నర్సాపూర్‌ గ్రామంలో ప్రసిద్ధి చెందిన కొండపోచమ్మ ఆలయ నూతన కార్యనిర్వహణాధికారిగా (ఈఓ) ముసినం మైసయ్య సోమవారం నియమితులయ్యారు.నేటి వరకు ఉన్నా ఈ.ఓ రవి కుమార్ రిటైర్డ్ అయ్యారు.ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, స్థానికులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని నూతన ఈఓ ముసినం మైసయ్య తెలిపారు.