మాజీ ఎంపీపీను పరామర్శించిన ముత్తారం కళాశాల అధ్యాపకులు
ముత్తారం, ఆగస్టు 31 (విజయ క్రాంతి): అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తారం మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ నాగినేని జగన్ మోహన్ రావును సోమవారం ముత్తారం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జగన్ మోహన్ రావుతో కొంతసేపు మాట్లాడిన కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఆయనకు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని, వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజా సేవా కార్యక్రమాల్లో తిరిగి చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.
ముత్తారం ప్రాంత ప్రజలతో, వివిధ వర్గాల వారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న జగన్ మోహన్ రావు అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న వెంటనే కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఆయనను స్వయంగా కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు పలువురు పాల్గొన్నారు.






