23 July, 2026 | 2:37 AM

కేంద్ర ప్రభుత్వ విధానాలు నీట్ విద్యార్థులకు అన్యాయం

23-07-2026 01:33 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్, జూలై 22,(విజయ క్రాంతి): నీట్ పరీక్ష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బుధవారం  విమర్శించారు. నెలరోజులుగా న్యాయం కోరుతున్న విద్యార్థులపై లాఠీఛార్జీ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఖండించిన ఆయన, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు కేంద్రం స్పందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పారిపెల్లి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.