4 May, 2026 | 8:38 PM

మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై ఇల్లందులో సంబరాలు

04-05-2026 07:33 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల లెక్కింపులో బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఇల్లందు పట్టణంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయాన్ని స్వాగతిస్తూ పట్టణ బీజేపీ అధ్యక్షురాలు సుచిత్ర వాసి ఆధ్వర్యంలో భారీగా బాణాసంచా కాల్చి ఆనందోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఒకరినొకరు అభినందించుకుంటూ జాతీయ జెండాలు ఊపుతూ “విజయం పార్టీకి బలం” అంటూ నినాదాలు చేశారు.

అనంతరం బిజెపి పట్టణ అధ్యక్షురాలు సుచిత్ర పాసి మాట్లాడుతూ మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని, అభివృద్ధి పాలనకు ఇది మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రామచందర్, రాజ్ కుమార్ పాసి, శివకుమార్ కండెల్వాల్, నరసింహారెడ్డి, జీవిత పాసి, పెద్దబోయిన సునీత, సుమలత తదితరులు పాల్గొన్నారు.