పీఎంశ్రీ విద్యాలయంలో వేడుకలు
బ్యాంక్ ఆఫ్ బరోడా 119వ వ్యవస్థాపక దినోత్సవం
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): బ్యాంక్ ఆఫ్ బరోడా 119వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణ నార్త్ రీజనల్ ఆఫీస్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద హైదరాబాద్‌లోని బేగంపేట ఏఎఫ్‌ఎస్‌లో గల పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఒక ఆర్‌ఓ నీటి శుద్దీకరణ ప్లాంట్‌ను అందజేసింది.
ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వ్యాస రచన పోటీని కూడా నిర్వహించి, అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నార్త్ రీజియన్ డీ జీఎం అండ్ రీజనల్ మేనేజర్ అనిల్ కుమార్ బి, తెలంగాణ నార్త్ రీజియన్ ఏజీ ఎం అండ్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ అభిషేక్ భారతి, పలువురు బ్రాంచ్ హెడ్లు, సి బ్బంది హాజరయ్యారు. పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం తరపున ప్రిన్సిపాల్ ఆర్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






