6 July, 2026 | 4:30 AM

హెచ్‌ఎండీఏ నిధులతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

06-07-2026 12:33 AM

మొయినాబాద్, జూలై 5 (విజయక్రాంతి): మొయినాబాద్ మండలంలోని బాకారం జాగీర్ గ్రామపంచాయతీ పరిధిలో హెచ్‌ఎండీఏ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం గ్రామ సర్పంచ్ ఎల్గని వెంకటేష్ గౌడ్, ఉపసర్పంచ్ సుభాష్ చంద్రబోస్ రెడ్డి, వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఎల్గని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాన్ని దశలవారీగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని అన్నారు.

గ్రామంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్థుల సహకారంతో బాకారం జాగీర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుభాష్ చంద్రబోస్ రెడ్డి, వార్డు సభ్యులు బంది అనిల్, ఉపేందర్ యాదవ్, కొండకల్ల రవి, మడి దినేశ్ రెడ్డి, బిక్షపతి గౌడ్, కొండకల్ల శ్రీకాంత్, కొండకల్ల మహేందర్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.