calender_icon.png 24 February, 2026 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లమ్మ తల్లి సిద్ధోగంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

23-02-2026 08:56:47 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం బావుసాయి గ్రామంలో జరుగుతున్న ఎల్లమ్మ తల్లి సిద్ధోగంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన హై మాస్ట్ లైట్లను విప్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, ప్రజల సౌకర్యాల కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి యాస్మిన్ పాషా,పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, తహసిల్దార్ వరలక్ష్మి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి  జగన్మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, సర్పంచ్ లు మస్కురి కాశీరం, బోయిని దేవరాజ్, జిల్లా నాయకులు, బండ నరసయ్య, నందు గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.