LeT వ్యవస్థాపకుడిపై NIA నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
14-07-2026 12:41 PM
జమ్మూ: పహల్గామ్ ఉగ్రవాద దాడికి(Pahalgam terror attack) సంబంధించిన దర్యాప్తులో భాగంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ 'లష్కర్-ఏ-తైబా'కు చెందిన పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న అధినేత హాఫిజ్ సయీద్‌పై ప్రత్యేక ఎన్‌ఐఏ ( National Investigation Agency) కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి కేసులో సయీద్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన రెండు రోజుల తర్వాత, అంటే జూలై 8న NIA కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈ ఉత్తర్వును జారీ చేశారు. భారత్,అమెరికాచే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించబడిన సయీద్, 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారిగా కూడా పరిగణించబడుతున్నాడని అధికారులు వెల్లడించారు.






