14 July, 2026 | 12:55 PM

మహారాష్ట్రలో గుట్కా నిషేధం.. తెలంగాణ నుండి జోరుగా రవాణా!

14-07-2026 11:50 AM

బోథ్, జులై 14 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర లో గుట్కా విక్రయాలపై నిషేధం ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నుండి విచ్చలవిడిగా గుట్కా అక్రమ రవాణా కొనసాగుతున్నది. సోనాల మండల కేంద్రం మీదుగా ఈ అక్రమ గుట్కా రవాణా కొనసాగుతుందని తెలిసింది. సోనాల మండలం ను ఆనుకుని ఉన్న కిన్వాట్  తాలూకా పరిధిలోని పలు గ్రామాలకు అక్రమ గుట్కా వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు సమాచారం.. 

మహారాష్ట్రలో పటిష్టమైన నిఘ ఉన్న

నిషేధించిన గుట్కా విక్రయాలపై మహారాష్ట్రలో అక్కడి పోలీసులు పటిష్టమైన నిఘా ఉన్న అడ్డదారుల్లో మహారాష్ట్రకు చేరవేస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్ర నుండి అక్రమ మద్యం దేశదారు సోనాల మండలానికి చేరుతుండగా సోనాల నుండి నిషేధిత గుట్కా వెళుతుందని అంటున్నారు. నిషేధిత గుట్కా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వారు స్వల్ప వ్యవధిలోనే సంపన్నులుగా మారుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.... 

సోనాలలో అడ్డా ఏర్పాటు చేసుకుని

సోనాల మండల కేంద్రంలో స్థానికంగా ఉన్న ఓ వ్యాపారి పెద్ద మొత్తంలో గుట్కాలను నిల్వచేసి ఇక్కడి నుండి ఆయన వాహనంలో మహారాష్ట్రకు తీసుకువెళ్లి విక్రయిస్తున్నట్లు తెలిసింది అయితే కొంతమంది మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు సహితం సోనాల నుండి నిషేధిత గుట్కాలను తీసుకువెళ్తున్నారని అంటున్నారు ఏది ఏమైనా సోనాల మండలం  అక్రమ వ్యాపారాలకు అడ్డగా మారిందని పలువురు పేర్కొంటున్నారు.