14 July, 2026 | 12:58 PM

బాలికల గురుకుల హాస్టల్ ఆకస్మిక తనిఖీ

14-07-2026 11:53 AM

పరిశుభ్రత,వసతులపై కమిషనర్ సమీక్ష

కల్లూరు,జూలై 14(విజయక్రాంతి): కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/జూనియర్ కళాశాల హాస్టల్‌ను మున్సిపల్ కమిషనర్ జి.సాయి కృష్ణ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.డైనింగ్ హాల్,వంటశాల,క్రీడా ప్రాంగణం, డ్రైనేజీ వ్యవస్థ,హాస్టల్ పరిసరాలను పరిశీలించిన ఆయన,విద్యార్థినులకు పరిశుభ్రమైన,సురక్షితమైన వాతావరణంలో అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

విద్యార్థినులతో మాట్లాడి ఆహారం,తాగునీరు, వసతి,పారిశుధ్యంపై వివరాలు తెలుసుకున్నారు.వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల నివారణ,వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.హాస్టల్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన కమిషనర్, సిబ్బందిని అభినందించారు.కార్యక్రమంలో ప్రిన్సిపల్ కనకదుర్గ,వైస్ ప్రిన్సిపల్ పద్మ,శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.