calender_icon.png 10 February, 2026 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మర్రిగూడలో పత్తాలేని ఏటీఎం బ్యాంకు సౌకర్యం

10-02-2026 01:57:00 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం కేంద్రంలో బ్యాంకులు ఉన్నప్పటికీ ఆధునీకత సౌకర్యార్థం ఏటీఎం మిషన్ అందుబాటులో ఉండాలని వినియోగదారులు కోరుచున్నారు. మండల కేంద్రంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వెరసి రైతు సేవ సంఘం పరపతి పేరుతో ప్రజల కోసం లావాదేవీలతో ఉన్నప్పటికీ మండల కేంద్రంలో ఏటీఎం మిషన్ గత కొన్ని నెలలుగా పత్తా లేకుండా పోయిందని ప్రజలుచర్చించుకుంటున్నారు.  కొన్ని సంవత్సరాలుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం మర్రిగూడ మండల కేంద్రంలో పనిచేస్తూనే  నిలిపివేయబడింది. దీంతో ఆధునీకత సౌకర్యార్థం చర్యలు చేపట్టి ఏ టి ఎం మిషను ఏర్పాటు చేయాలని బ్యాంకు ఉన్నతాధికారులను మర్రిగూడ మండల వినియోగదారులు కోరుకుంటున్నారు.