20 July, 2026 | 5:10 PM

Breaking News

చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •   తల్లిదండ్రుల త్యాగమే విద్యార్థుల విజయానికి పునాది: స్ఫూర్తి ఫౌండేషన్   •   కొడంగల్‌లో సీఎం రేవంత్ రెండు రోజుల పర్యటన   •   బోధన్ మధు మలంచ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల దుస్థితి   •   నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి రాజీనామా చేయాలి: సిఐటియు డిమాండ్   •   ఐలాండ్ నిర్మాణ పనుల్లో నాణ్యత కరువు..!   •   పసి పిల్లలకు తొలి ముద్ద ఆరోగ్యానికి ఎంతో మేలు   •   సింగరేణి అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి   •  

ఒక్కో వార్డుకు రూ.8 కోట్ల నిధులు ఇప్పిస్తా !

10-02-2026 01:54 PM

* కాంగ్రెస్ అభ్య‌ర్థుల గెలుపుతోనే అభివృద్ధి

* టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి

సదాశివపేట: కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న 26 మంది వార్డ్ కౌన్సిలర్లను గెలిపిస్తే ఒక్కో వార్డుకు రూ.8 కోట్ల నిధులు మంజూరు చేయిస్తాన‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి హామీనిచ్చారు. సోమ‌వారం స‌దాశివ‌పేట‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో సీఎం దగ్గరికి వెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు.

సదాశివ‌పేట‌లో 26 మంది కౌన్సిలర్లను గెలిపించి నా దగ్గరికి రావాలని కోరారు. అలాగే సదాశివపేటకు స్టేడియం, స్విమ్మింగ్ పూల్, పాత జాగాలోనే హాస్పిటల్ ను మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకువెళ్లి ఆరు నెలల్లో శంకుస్థాపన చేస్తానని, అలాగే ఊబ చెరువును ఇంకా సుందరీకరంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. జగ్గారెడ్డి మాట ఇస్తే తప్పడని క‌చ్చితంగా మాట నిలబెట్టుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.